YS Jagan: వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించండి: పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్

YS Jagan party founder requests axe symbol
  • పార్టీకి గొడ్డలి గుర్తు కేటాయించాలని ఈసీకి శివకుమార్ లేఖ
  • గుర్తు మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని వెల్లడి
  • వీలైనంత త్వరగా గుర్తును మార్చాలని ఈసీకి విన్నపం
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రస్తుతం తమ పార్టీకి 'ఫ్యాన్' గుర్తు ఉందని... పలు అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ పార్టీ చిహ్నాన్ని 'గొడ్డలి' గుర్తుగా మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ భవిష్యత్తు, గుర్తింపు, రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డలిని తమ పార్టీ చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నానని శివకుమార్ లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలు, డాక్యుమెంట్లు, అఫిడవిట్లు లేఖకు జత చేశామని తెలిపారు. మీ సానుకూల పరిశీలన కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈసీకి శివకుమార్ రాసిన లేఖ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. 
YS Jagan
YSRCP
YSR Congress Party
Election Commission
AP Politics
Political Symbol
Axe Symbol
Shiva Kumar
Andhra Pradesh

More Telugu News