Donald Trump: పుతిన్‌కు డెడ్ లైన్ విధించిన ట్రంప్!

Donald Trump Sets Deadline for Putin on Ukraine War
  • ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ట్రంప్
  • పుతిన్‌కు 50 రోజులు డెడ్ లైన్ విధించిన ట్రంప్
  • ఆ తర్వాత భారీ వడ్డనేనన్న ట్రంప్
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు.

యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గడువు విధించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, 50 రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలోపు యుద్ధాన్ని ఆపకపోతే సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వైట్‌హౌస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుతైతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వాణిజ్యాన్ని తాను చాలావాటికి వాడుకుంటుంటానని, యుద్ధాలను పరిష్కరించడానికి కూడా అవి ఉపయోగపడటం గొప్పగా ఉందంటూ, భారత్ - పాక్ ఘర్షణను ప్రస్తావించారు. పుతిన్‌పై ట్రంప్ మండిపడుతూ, ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు.

'పుతిన్ పగలంతా మాట్లాడతారు. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు, ఆ ప్రవర్తన మాకు నచ్చట్లేదు' అంటూ దుయ్యబట్టారు. యుద్ధం విషయంలో 50 రోజుల్లో ఒప్పందానికి రాకపోతే రష్యా ఊహించని సుంకాలు చెల్లించాల్సి వస్తుందని, ఆ సుంకాలు వంద శాతం దాటే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని ఇబ్బంది పడుతున్న రష్యా సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. 
Donald Trump
Putin
Russia Ukraine war
Ukraine
NATO
Mark Rutte
Tariffs
Trade
US Foreign Policy

More Telugu News