చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు.. మీరా ఆయన గురించి మాట్లాడేది?: అనిత

  • పేర్ని నాని వ్యాఖ్యలపై మండిపడిన హోంమంత్రి అనిత
  • 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని వ్యాఖ్య
  • ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు
ఉదయం లేచి నాలుగైదు టాబ్లెట్లు మింగి, పది సంతకాలు చేసేసరికి చేతులు వణికే వాళ్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు, వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. చంద్రబాబులా రెండు గంటల పాటు నిలబడి, ఒకే అంశంపై ఎదుటివారిని ఉత్తేజపరిచేలా ఎవరైనా మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తిని ఇలా విమర్శించడం సమంజసమా? అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  

మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అనిత తీవ్రంగా ఖండించారు. "76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకురావడానికి రోజూ 18 గంటలు శ్రమిస్తుంటే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడతారా? 'చీకట్లో కన్నుకొడతాం' అని ఒకవైపు, 'బహిరంగంగా చంపమని చెబుతాం' అని మరోవైపు అంటారు. మంత్రిగా పనిచేసిన, అసెంబ్లీలో అధ్యక్షా అన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరైనదా? ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ సహించాలా?" అని అనిత తీవ్రస్వరంతో హెచ్చరించారు. 


More Telugu News