Wife kills husband: సినీ ఫక్కీలో భర్తను చంపించిన భార్య
- తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
- రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి
- కారుతో ఢీకొట్టించి భార్య హత్య చేయించినట్లు నిర్ధారించిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. కాటేపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్వామిని వెనుక నుండి కారు ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన స్వామిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసి హత్య కోణంలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, భార్యనే ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు కారును అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.