Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. గంజాయి అమ్మకాల్లో తేడా రావడంతో వ్యక్తి హత్య

Hyderabad Old City Man Murdered Over Ganja Sales Dispute
  • గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య ఘర్షణ
  • స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా అజీజ్ అనే వ్యక్తి హత్య
  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒక హత్యకు దారితీసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల్లో విభేదాలు రావడంతో రెండు గ్రూపుల మధ్య సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం చోటు చేసుకుంది.

వివాదం ముదిరి ఒక గ్రూపులోని అజీజ్ అనే వ్యక్తి స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి అతడిని హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, తెలంగాణలో డ్రగ్స్ పట్ల అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Hyderabad Old City
Hyderabad
Old City
Ganja sales
Murder
Chandrayangutta
Telangana Drugs

More Telugu News