Sheikh Hasina: షేక్ హసీనాకు మరో షాక్.. కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Sheikh Hasina Daughter Saima Wazed Sent on Leave by WHO
  • ప్రపంచ ఆరోగ్య సంస్థలో విధులు నిర్వహిస్తున్న సైమా వాజెద్
  • బంగ్లాదేశ్‌లో సైమా వాజెద్‌పై అవినీతి కేసులు నమోదు
  • అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ అభియోగాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో విధులు నిర్వహిస్తోన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ ను సెలవుపై పంపించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై అవినీతి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం ఢిల్లీలో ఉంది. సైమా స్థానంలో డాక్టర్ కేథరీనా బోహ్మే తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు.

సైమా వాజెద్ డబ్ల్యుహెచ్‌వో ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు, ఆమె ప్రస్తుతం సెలవులో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సమాధానమిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్ షేక్ హసీనా కుమార్తెపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ అభియోగాలను మోపింది.

షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో మాజీ ప్రధానికి ఇది మరో ఎదురుదెబ్బ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీఖుల్ అలామ్ తెలిపారు.
Sheikh Hasina
Saima Wazed
World Health Organization
WHO
Bangladesh

More Telugu News