Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం... రాయలసీమ, షిరిడి ఎక్స్ ప్రెస్ రైళ్లలో మంటలు!

Tirupati Railway Station Fire Rayalaseema Shirdi Express Trains Catch Fire
  • లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు
  • రెండు బోగీలు దగ్ధం
  • భయాందోళనలకు గురైన ప్రయాణికులు
తిరుపతి రైల్వేస్టేషన్‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లూప్‌లైన్‌లో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 

ఈ అగ్నిప్రమాదంతో తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Tirupati Railway Station
Rayalaseema Express
Shirdi Express
Tirupati fire accident
Andhra Pradesh news
Indian Railways
Train fire
Railway accident
Fire accident

More Telugu News