Etihad Airways: పైలట్లకు ఎతిహాద్ ఎయిర్ వేస్ హెచ్చరిక

Etihad Airways Alerts Pilots on Boeing 787 Fuel Switches
--
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలి అందులోని 241 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు చేసిన నిపుణుల కమిటీ.. ఇంధన స్విచ్ లు ఆఫ్ కావడం వల్లే విమానం కూలిపోయిందని తేల్చింది. తాజాగా ఈ నివేదిక బయటపెట్టడంతో మిగతా విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

దీంతో బోయింగ్‌ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్‌లపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ తన పైలట్లకు అలర్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేసమయంలో తమ సంస్థకు చెందిన అన్ని విమానాల్లో ఇంధన స్విచ్ ల పనితీరును పరిశీలించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Etihad Airways
Etihad Airways pilots
Boeing 787
fuel switch
fuel supply
Air India crash
Ahmedabad
aviation safety

More Telugu News