Priyank Kharge: డ్రగ్స్ కేసులో ప్రియాంక్ ఖర్గే సన్నిహితుడి అరెస్ట్

Priyank Kharge Associate Lingaraj Kanni Arrested in Drugs Case



కర్ణాటక కాంగ్రెస్ లో కలకలం రేగింది. రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సన్నిహితుడు, సౌత్ కలబురిగి కాంగ్రెస్ అధ్యక్షుడు లింగరాజ్ కన్ని డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ఈమేరకు లింగరాజ్ కన్ని నిషేధిత కొడైన్ సిరప్ అమ్ముతుండగా పట్టుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. కన్ని దగ్గర నుంచి కొడైన్ సిరప్ 120 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ బాటిళ్లను ఆయన ఎక్కడి నుంచి సేకరించాడు, ఎక్కడికి తరలిస్తున్నాడనే వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు థానే పోలీసులు తెలిపారు.

లింగరాజ్ కన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు సౌత్ కలబురిగి ఎమ్మెల్యే అల్లమ ప్రభు పాటిల్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో లింగరాజ్ అరెస్టుతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. పార్టీలోనూ ఈ విషయంపై వివాదం రేగుతోంది. మరోవైపు, లింగరాజ్ కన్ని అరెస్టు నేపథ్యంలో ఆయనతో సంబంధాలు ఉన్న నేతలు, ప్రముఖుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది.
Priyank Kharge
Karnataka Congress
Lingaraj Kanni
Drugs Case
Codeine Syrup
Kalaburagi
Allam Prabhu Patil
Maharashtra Police

More Telugu News