Gali Janardhan Reddy: తను ఒక ప్యాషన్ తో సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నాడు: గాలి జనార్దన్ రెడ్డి

Gali Janardhan Reddy on Kiriti Reddys Passionate Entry into Cinema
  • గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా 'జూనియర్' చిత్రం
  • హీరోయిన్ గా శ్రీలీల... కీలకపాత్రలో జెనీలియా
  • రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
  • బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్... హాజరైన గాలి జనార్దన్ రెడ్డి 
  • జులై 18న రిలీజవుతున్న 'జూనియర్'
బెంగళూరులో జరిగిన ‘జూనియర్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉత్సాహంగా మాట్లాడారు. కిరీటి రెడ్డి నటిస్తున్న తొలి చిత్రం ‘జూనియర్’ జులై 18న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, “నా కుమారుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కిరీటి ఒక ప్యాషన్ తో సినీ రంగంలోకి వస్తున్నాడు. తన నటనా నైపుణ్యంతో పాటు, ఈ చిత్రంలో డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా రాణించాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతంతో రూపొందిన ఈ చిత్రం యువతను ఆకట్టుకోవడమే కాకుండా అందరి మనసులను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కిరీటిని ఆదరిస్తారని, ‘జూనియర్’ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. నా కుమారుడికి పునీత్ రాజ్ కుమార్ ఆశీస్సులు ఉంటాయి. జేమ్స్ సినిమా సమయంలో పునీత్ తో కిరీటి విలువైన సమయం గడిపాడు” అని వివరించారు. ఇక నిర్మాత సాయి కొర్రపాటి గురించి చెబుతూ, తామిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని గాలి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శ్రీలీల చిన్నప్పటి నుంచి తనకు తెలుసని అన్నారు.

‘జూనియర్’ చిత్రం వరాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మితమైంది. ఈ యూత్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా డిసౌజా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి.
Gali Janardhan Reddy
Kiriti Reddy
Junior Movie
Sreeleela
Radha Krishna
Devi Sri Prasad
Varahi Chalana Chitram
Telugu Movie
Kannada Movie
Puneeth Rajkumar

More Telugu News