Tungabhadra River: ఏపీలో తుంగభద్ర నది నుంచి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీత

Tungabhadra River Tragedy Three Students Drown in AP
  • కర్ణాటక నుంచి మంత్రాలయం వచ్చిన భక్తులు
  • తుంగభద్ర నది వద్ద ఫొటోలు తీసుకుంటూ ప్రవాహంలో చిక్కుకున్న వైనం
  • మృతులు కర్ణాటకకు చెందిన డిగ్రీ విద్యార్థులు
ఏపీలో తుంగభద్ర నదిలో మునిగి మరణించిన ముగ్గురు భక్తుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు కర్ణాటకకు చెందిన సచిన్ (20), ప్రమోద్ (20), అజిత్ (19)గా గుర్తించారు. వీరు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం పుణ్యక్షేత్రం వద్ద తుంగభద్ర నదిలో స్నానం చేస్తూ, ఫోటోలు తీస్తూ మునిగిపోయారు. సచిన్ ప్రమాదవశాత్తు జారిపడగా, అతన్ని కాపాడటానికి ప్రయత్నించి ప్రమోద్, అజిత్ కూడా మునిగిపోయారు. వారి స్నేహితుడు రఘునాథ్‌ను స్థానికులు రక్షించారు. తుంగభద్ర డ్యామ్ నుంచి భారీగా నీరు వస్తున్నప్పటికీ, హెచ్చరికలను విస్మరించి యువకులు నదిలోకి దిగి ప్రమాదానికి గురయ్యారు.

కర్ణాటక నుంచి ఏడుగురు భక్తుల బృందం శుక్రవారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి చేరుకుంది. వారు హోటల్ నుంచి బయలుదేరి నది ఒడ్డుకు వెళ్లారు. బలమైన నీటి ప్రవాహంలో చిక్కుకుని వారిలో ముగ్గురు భక్తులను కొట్టుకుపోయారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించినా, భారీ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం గాలింపు చర్యలు తిరిగి ప్రారంభం కాగా, వారి మృతదేహాలు లభ్చమయ్యాయి. మరణించిన వారు కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని జవగల్లుకు చెందిన డిగ్రీ విద్యార్థులుగా గుర్తించారు.
Tungabhadra River
Andhra Pradesh
Karnataka
Mantralayam
Drowning
River accident
Sachin
Pramod
Ajith
Kurnool district

More Telugu News