కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు: వైఎస్ జగన్

  • కోట శ్రీనివాసరావు మృతికి వైఎస్ జగన్  సంతాపం
  • కోటను ప‌ద్మ‌శ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయన్న వైఎస్ జగన్
  • కోట మృతిపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సంతాప సందేశం
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా కోట మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆయన పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వైఎస్ జగన్ నివాళులర్పించారు. 




More Telugu News