IIM Kolkata: కోల్ కతా ఐఐఎం అత్యాచారం వ్యవహారంలో కొత్త ట్విస్ట్!

IIM Kolkata Rape Case New Twist Father Denies Allegations
  • కోల్ కతా ఐఐఎం బాయ్స్ హాస్టల్ లో అమ్మాయిపై అత్యాచారం అంటూ కలకలం
  • అయితే తమ కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్న తండ్రి 
  • ఆమె ఆటో నుంచి కిందపడిందని వెల్లడి
కోల్ కతాలోని ప్రఖ్యాత ఐఐఎం బాయ్స్ హాస్టల్ లో ఓ విద్యార్థి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ విద్యార్థిని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, దాంతో ఆ విద్యార్థి కౌన్సెలింగ్ ఇస్తానని హాస్టల్ కు పిలిచి తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాని ఆ అమ్మాయి తెలిపింది. తాను స్పృహ కోల్పోగా, తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కలకత్తా విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న వార్తలను ఆమె తండ్రి ఖండించారు. తన కుమార్తె ఆటో-రిక్షాలో నుంచి పడిపోయిందని, అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి 9:34 గంటలకు తనకు ఫోన్ వచ్చిందని, తన కుమార్తెను పోలీసులు రక్షించి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగానికి తరలించారని ఆయన పేర్కొన్నారు.

తన కుమార్తెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని, ఆమెను హింసించలేదని లేదా దురుసుగా ప్రవర్తించలేదని తండ్రి పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులో భాగంగా తన కుమార్తె ఏదో వ్రాయమని అడిగారని, దాంతో ఆమె ఆ పత్రంలో వివిధ అంశాలను రాసిందని ఆయన వెల్లడించారు. ఆమె చెప్పిన ప్రకారం ఓ వ్యక్తిని అరెస్ట్  చేశామని పోలీసులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

అయితే, తాను తన కుమార్తెతో మాట్లాడానని, తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని ఆమె తనతో చెప్పిందని ఆయన వివరించారు. పోలీసులు చెప్పినట్టే ఫిర్యాదు పత్రంలో రాశానని పేర్కొందని కూడా ఆయన వెల్లడించారు.
IIM Kolkata
IIM Calcutta
Kolkata IIM
Rape Allegation
Student Assault
False Accusation
SSKM Hospital
West Bengal Police

More Telugu News