Anam Ramanarayana Reddy: శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి ఆనం

Minister Anam Review Meeting on TTD Employee Issues
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామన్న ఆనం
  • 160 ఆలయాల్లో భక్తుల దర్శనాన్ని సులభతరం చేశామని వెల్లడి
  • నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నామన్న మంత్రి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీలోని పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఆనం చెప్పారు. సీఎం ఆమోదం పొందిన తర్వాత ఆ నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 160 ఆలయాల్లో భక్తులకు దర్శనాన్ని సులభతరం చేశామని, నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నామని చెప్పారు. 300 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.
Anam Ramanarayana Reddy
Tirumala
TTD
Andhra Pradesh Temples
Temple welfare fund
Chandrababu Naidu
Hindu Temples
Devadaya Department

More Telugu News