Mohammed Siraj: జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు: ఫుట్‌బాల్ ఆటగాడి మృతిపై బౌలర్ సిరాజ్

Mohammed Siraj Reacts to Football Players Death
  • లార్డ్స్ టెస్టులో రెండు వికెట్లు తీసిన సిరాజ్
  • పోర్చుగల్ ఆటగాడు డియోగో జోటాకు అంకితమిచ్చిన సిరాజ్
  • రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన డియోగో జోటా
  • జీవితానికి గ్యారెంటీ లేదన్న సిరాజ్
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, చాలా విషయాల కోసం మనం పోరాడుతుంటామని, కానీ రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదని భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సందర్భంగా పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు డియోగో జోటాకు అంకితమిస్తున్నట్లు హావభావాలు ప్రదర్శించాడు.

తాజాగా, దీనిపై సిరాజ్ ఒక వీడియోలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ 'ఎక్స్' వేదికగా పంచుకుంది. "గత మ్యాచ్ సమయంలో డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. నేను పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు అభిమానిని. దీంతో నేను భావోద్వేగానికి గురయ్యాను" అని సిరాజ్ పేర్కొన్నాడు.

జీవితం అంచనాలకు అందనిదని, జీవితానికి ఎప్పుడూ గ్యారెంటీ లేదని సిరాజ్ అన్నాడు. రోడ్డు ప్రమాదం గురించి విని షాకయ్యానని, ఆ విషయం తెలియగానే లార్డ్స్‌లో వికెట్లు తీసిన తర్వాత అంకితమిచ్చినట్లు చెప్పాడు.
Mohammed Siraj
Diogo Jota
Portugal Football
Lord's Test
Road Accident
Cricket
BCCI

More Telugu News