Raja Singh: రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ హైకమాండ్
- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంపై రాజాసింగ్ అసంతృప్తి
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం
- రాజీనామాను ఆమోదించనట్టు అరుణ్ సింగ్ ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధం తెగిపోయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి రాజాసింగ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని... అందుకే పార్టీకి రాజీనామా చేశానని రాజాసింగ్ పేర్కొన్నారు.