హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట

  • కాంగ్రెస్ నేతలపై బీజేపీ పరువునష్టం దావా
  • 'అవినీతి రేటు కార్డు' ప్రకటనపై బీజేపీ దావా
  • కేసును తాత్కాలికంగా నిలిపివేసిన హైకోర్టు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో భారీ ఉరట లభించింది. ఆయనపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో... 'అవినీతి రేటు కార్డు' ప్రకటనపై బీజేపీ పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఇందులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లను చేర్చింది. 

బీజేపీ లంచం తీసుకున్నట్టు 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లను నిర్ణయించిందని ఆరోపించింది. ఈ ప్రకటన ద్వారా తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ బీజేపీ పరువునష్టం దావా వేసింది. ఈ కేసును ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతలకు భారీ ఊరట లభించింది. 


More Telugu News