Praveen Kumar: పెళ్లి చేస్తామని హామీ ఇచ్చినా.. తుంగభద్ర కాల్వలోకి దూకి ప్రేమికుల గల్లంతు

Lovers Drown in Tungabhadra Canal After Eloping Despite Marriage Promise
  • కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఘటన
  • తమ ప్రేమను ఇంట్లో అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పరార్
  • పెళ్లి జరిపిస్తామన్న హామీతో తిరిగి ఇంటికి చేరుకున్న జంట
  • కుటుంబ సభ్యులు కీడు తలపెట్టే అవకాశం ఉండటంతో ఆత్మహత్య!
తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఓ ప్రేమ జంట కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హోసలింగాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (18), సానపుర గ్రామానికి చెందిన అంజలి (18) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమను కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కలిసి జీవించడం సాధ్యం కాదని భావించిన వీరు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో పెళ్లి చేస్తామని ఇరు కుటుంబాలు హామీ ఇవ్వడంతో ఆ జంట మునీరాబాద్‌కు తిరిగి వచ్చింది.  

పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ తమ కుటుంబాలు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించిన ప్రేమికులు ఈ నెల 9న సాయంత్రం మునీరాబాద్ డ్యామ్‌పైకి చేరుకుని తుంగభద్ర ఎడమగట్టు కాలువలోకి దూకారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తుంగభద్ర కాలువలో వారి కోసం గాలించారు. స్థానిక మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చేపట్టారు. కాలువకు భారీగా వరద రావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. 
Praveen Kumar
Anjali
Lovers suicide
Tungabhadra canal
Koppal district
Karnataka
Love affair
Munirabad dam
Suicide pact
Hosaligapur

More Telugu News