R Narayana Murthy: మా సినిమాకు ప్రభుత్వ తోడ్పాటు అవసరంలేదు: ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy Says No Government Support Needed for His Movie
  • ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
  • ఆగస్టు 22న విడుదల కానున్న మూవీ 'యూనివర్శిటీ పేపర్ లీక్' 
  • రాయితీలు వద్దు, సినిమాను ప్రమోట్ చేయండన్న నారాయణమూర్తి
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ సినిమాలకు ప్రభుత్వ రాయితీలు కావాలంటూ నిర్మాణ సంస్థలు విజ్ఞప్తులు చేస్తున్న ఈ తరుణంలో, తన సినిమాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదంటూ ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వీయ దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటించిన 'యూనివర్సిటీ పేపర్ లీక్' మూవీ వచ్చే నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ థియేటర్లో పలువురు ప్రజా ప్రతినిధులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఈ మూవీని వీక్షించారు. నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నుంచి రాయితీలు వద్దని, సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. అద్దంకి దయాకర్ తాను ప్రభుత్వంతో మాట్లాడి 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమాకి టాక్స్ లేకుండా చేస్తానన్నారని, అలాగే తమ శ్రేయోభిలాషి, ప్రముఖ కవి అందెశ్రీ కూడా ఈ సినిమాకి టాక్స్ రాయితీ ఇప్పించాల్సిందిగా దయాకర్ ను కోరారని, ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అయితే, తన సినిమాకు ట్యాక్స్ ఫ్రీ అవసరం లేదని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి తనకు ఏ సహకారం అవసరం లేదని, అయితే వారి నుంచి తాను కోరుకునేది ఈ సినిమాను ప్రమోట్ చేయడమేనన్నారు. సినిమా జనాల్లోకి వెళ్లేలా చేస్తే, ఏ మాత్రం సినిమా బాగున్నా జనానికి కనెక్ట్ అయి సక్సెస్ అవుతుందని అన్నారు. 
R Narayana Murthy
University Paper Leak
Telugu cinema
tax exemption
government support
Ande Sri
Addanki Dayakar
movie promotion
Tollywood

More Telugu News