Chandrababu Naidu: సత్యసాయి మహా సమాధిని సందర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Visits Sathya Sai Maha Samadhi
  • శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కొత్తచెరువులో మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం
  • పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్న చంద్రబాబు, లోకేశ్
  • సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న ముఖ్యమంత్రి
  • సీఎం వెంట కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివరాల్లోకి వెళితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తన పర్యటనలో భాగంగా తొలుత కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, ఆయన నేరుగా పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు.

అక్కడ ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh CM
Sathya Sai Baba
Puttaparthi
Prasanthi Nilayam
Shivraj Singh Chouhan
Nara Lokesh
Sathya Sai Samadhi
Andhra Pradesh News

More Telugu News