Kakani Govardhan Reddy: కాకాణిని రెండో రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు

Kakani Govardhan Reddy Questioned by Police for Second Day
  • కనుపూరు చెరువు మట్టి తవ్వకాల కేసులో విచారణ
  • వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
  • వ్యాపార, రాజకీయ సంబంధాలపై ప్రశ్నల వర్షం
కనుపూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారన్న ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు రెండో రోజు కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయన్ను లోతుగా ప్రశ్నిస్తున్నారు.

ఈ ఉదయం నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయవాది సమక్షంలో జరుగుతున్న ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను తిరిగి జిల్లా జైలుకు పంపనున్నారు.

మొదటి రోజు విచారణలో భాగంగా పోలీసులు కాకాణిపై దాదాపు 30 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆయన రాజకీయ, వ్యాపార సంబంధాలపై దృష్టి సారించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న మందల వెంకట శేషయ్యతో ఉన్న పరిచయాలు, అల్లంపాటి నిరంజన్ రెడ్డితో జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే రెండో రోజు విచారణ కూడా సాగుతోందని సమాచారం.

Kakani Govardhan Reddy
Kakani
Nellore
Illegal soil mining
Kanupuru lake
Mandal Venkata Sesaiah
YSRCP
Andhra Pradesh politics
Venkata chalam Police Station
Allampati Niranjan Reddy

More Telugu News