Abhirami: సీనియర్ స్టార్స్ జోడీగా 'అభిరామి' హవా!

Abhirami Special
  • కథానాయికగా అలరించిన అభిరామి
  • నాలుగు భాషలలో బిజీగా ఉండే నటి
  • సీనియర్ స్టార్ హీరోల సరసన పాత్రలు 
  • యంగ్ హీరోల మదర్ పాత్రలలోను బిజీ 

తెలుగులో సీనియర్ హీరోలతో ఒక సినిమా చేయాలంటే ముందుగా హీరోయిన్ గురించిన ఆలోచన చేయడమనేది చాలా రోజులుగా జరుగుతూ వస్తోంది. ఈ విషయంలో నిన్నమొన్నటి వరకూ శ్రియా .. కాజల్ .. తమన్నా కొంతవరకూ బెంగ లేకుండా చేశారు. అప్పుడప్పుడూ రమ్యకృష్ణ .. స్నేహ ఆదుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొత్తదనం కోసం గట్టి గాలింపే మొదలైంది. ఫలితంగా 'అభిరామి' తెరపైకి వచ్చింది. అభిరామి మలయాళ .. తమిళ .. కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. తెలుగులోను థాంక్యూ సుబ్బారావు .. చార్మినార్ .. చెప్పవే చిరుగాలి వంటి సినిమాలలో కథానాయికగా ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత 2018లో వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలోనే కేరక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఆ తరువాత 'సరిపోదా శనివారం' సినిమాలో చేసిన నాని తల్లి పాత్రలో ఆమె ఇక్కడి ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయింది.ఇక ఇటీవల వచ్చిన 'థగ్ లైఫ్' సినిమాలో ఆమె కమల్ సరసన నటించింది. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. వయసుతో పాటు గ్లామర్ పెరుగుతున్న కథానాయికల జాబితాలో త్రిష తరువాత అభిరామి కూడా ఉందని అంతా గ్రహించారు. అభిరామి అంటే అందం .. అందం అంటే అభిరామి అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కొట్టేసింది. అభిరామి ఆకర్షణీయమైన రూపమే ఇప్పుడు ఆమెకి యంగ్ హీరోల మదర్ గా .. సీనియర్ హీరోల సరసన అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. త్వరలో టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన అభిరామి కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.    

Abhirami
Telugu cinema
Tollywood
senior actors
actress
Saripodaa Sanivaaram
Thank You Subbarao
Charminar
Thug Life
Kamal Haasan

More Telugu News