New Mexico Floods: వరద నీటిలో కొట్టుకుపోయిన ఇల్లు.. వైరల్ వీడియో

New Mexico Floods House Washed Away in Ruidoso Viral Video
  • అమెరికాలో న్యూ మెక్సికోలో భారీ వర్షాలకు నిమిషాల్లోనే పోటెత్తిన నది
  • రుయిడోసో కౌంటీని ముంచెత్తిన వరద.. ముగ్గురు గల్లంతు
  • కళ్ల ముందే కొట్టుకుపోయిన ఇల్లు.. అమెరికాలో భయానక దృశ్యాలు!
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో పలు కౌంటీలను వరదలు ముంచెత్తాయి. రుయిడోసో కౌంటీని నిన్న మధ్యాహ్నం ఆకస్మిక వరద ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ఉధృతికి ఓ ఇల్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు ధ్రువీకరించారు.

వివరాల్లోకి వెళితే.. గతేడాది కార్చిచ్చుల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రియో రుయిడోసో నది ఒక్కసారిగా పోటెత్తింది. కేవలం గంట వ్యవధిలోనే నది నీటిమట్టం రికార్డు స్థాయిలో 20.24 అడుగులకు చేరిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో రుయిడోసో కౌంటీలో అధికారులు 'ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీ'ని ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు తక్షణమే ఎత్తైన, సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు.

ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని రుయిడోసో మేయర్ లిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా తీవ్ర గాయాలైనట్లు సమాచారం లేదని వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కౌంటీ అధికార ప్రతినిధి కెర్రీ గ్లాడెన్ వెల్లడించారు. వరదల కారణంగా డజన్ల కొద్దీ రోడ్లను మూసివేశామని తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి, సురక్షితంగా ఉండాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.
New Mexico Floods
Ruidoso
Ruidoso New Mexico
Flash Flood Emergency
Rio Ruidoso River
Climate Change
Extreme Weather
US Flooding
Natural Disasters

More Telugu News