Ramakrishna CPI: సీఎం చంద్రబాబు దృష్టికి పలు ప్రధాన సమస్యలు తీసుకువచ్చిన సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Brings Key Issues to CM Chandrababus Attention
  • విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలను పరిష్కరించాలన్న సీపీఐ రామకృష్ణ
  • ఏపీ స్థానికత కల్గిన హోంగార్డులను తెలంగాణను రప్పించాలి
  • సీఎం చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందించిన సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వినతి పత్రం సమర్పించారు. నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రామకృష్ణ సమస్యలను వివరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రధానంగా హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైద్య విద్యలో విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు ఏపీ వైద్య మండలి శాశ్వత రిజిస్ట్రేషన్ నిరాకరిస్తోందని, ఈ నిబంధనను సవరించేలా చూడాలని కోరారు. అలానే రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపు, పోలీసుల పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన సుమారు 400 మంది హోంగార్డులు తెలంగాణలో పని చేస్తున్నారని, వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 
Ramakrishna CPI
Chandrababu Naidu
Andhra Pradesh
AP Home Guards
Home Guard Salary Hike
Foreign Medical Graduates
AP Medical Council
Telangana Home Guards
AP Telangana Bifurcation Issues

More Telugu News