Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ను సందర్శించిన విదేశీ ప్రతినిధుల బృందం

Foreign Delegates Visit Nagarjuna Sagar
  • నాగార్జునసాగర్ ను సందర్శించిన 24 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు
  • పర్యావరణ పరిరక్షణపై శిక్షణ పొందుతున్న విదేశీ ప్రతినిధులు
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగర్ సందర్శన
పర్యావరణ పరిరక్షణపై శిక్షణ పొందుతున్న 24 దేశాల విదేశీ ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్‌ను సందర్శించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 24 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.

సాగర్ జలాశయం, జలవిద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు వారికి సాగర్ ప్రాజెక్టు చరిత్రను వివరించారు. కాగా, నాగార్జునసాగర్‌కు ఇటీవల విదేశీ సందర్శకుల తాకిడి పెరిగింది. రెండు రోజుల క్రితమే శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు సాగర్‌ను సందర్శించారు. 
Nagarjuna Sagar
Foreign Delegates
Nagarjuna Sagar Project
Environmental Protection Training
Ministry of External Affairs
Hydroelectric Power Plant
Telangana Tourism
Sri Lanka Media
Dam Visit

More Telugu News