Donald Trump: ట్రంప్ సుంకాల గండం.. భారత ఫార్మా, రాగి ఎగుమతులపై ఆందోళన
- రాగి దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్
- ఏడాది తర్వాత ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ హెచ్చరిక
- భారత ఫార్మా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
- ఆగస్టు 1 గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించిన ఆయన, తాజాగా రాగి (కాపర్) దిగుమతులపై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఏడాది తర్వాత ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం వరకు పెనుభారం మోపనున్నట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు భారత్‌పై, ముఖ్యంగా దేశ ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. "ఈరోజు మేము రాగిపై చర్యలు తీసుకుంటున్నాం. దానిపై సుంకాన్ని 50 శాతంగా నిర్ణయించబోతున్నాం" అని ఆయన తెలిపారు. ఈ కొత్త సుంకాలు జులై చివరి నాటికి లేదా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రావచ్చని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ వెల్లడించారు. ఫార్మా రంగంపై కూడా త్వరలోనే ప్రకటన ఉంటుందని, అయితే ఔషధ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకోవడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం ఇస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. "ఆ తర్వాత వారిపై 200 శాతం వంటి చాలా అధిక రేటుతో సుంకాలు విధిస్తాం" అని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తాజా నిర్ణయాలు భారత ఎగుమతిదారులను కలవరపెడుతున్నాయి. అమెరికా భారత ఫార్మా ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఇది మన మొత్తం ఫార్మా ఎగుమతులలో 40 శాతానికి సమానం. ఒకవేళ 200 శాతం సుంకం అమలైతే భారత ఫార్మా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక రాగి ఎగుమతుల్లో అమెరికాకు భారత్ నుంచి 17 శాతం వాటా ఉంది.