నేరుగా హాట్ స్టార్ కి వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్!

  • దేశభక్తి నేపథ్యంలో మరో యాక్షన్ థ్రిల్లర్ 
  • కశ్మీర్ చుట్టూ తిరిగే కథ
  • కరణ్ జొహార్ నిర్మించిన సినిమా 
  • దర్శకుడిగా కాయోజ్ ఇరానీ పరిచయం 
  • ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్

 'జియో హాట్ స్టార్' ట్రాక్ పైకి నేరుగా ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ రానుంది. ఆ సినిమా పేరే 'సర్జమీన్'.  కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాకి, కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహించాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ .. కాజోల్ ... ఇబ్రహీమ్ అలీఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కశ్మీర్ లోని ఉగ్రవాదంపై భారతీయ సైన్యం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం భారీగానే ఖర్చు చేశారు. 

ఈ సినిమాను నేరుగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ .. అయన భార్య పాత్రలో కాజోల్ .. ఉగ్రవాది పాత్రలో ఇబ్రహీం అలీఖాన్ కనిపించనున్నారు. యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. 

కశ్మీర్ నేపథ్యంలో .. దేశభక్తి నేపథ్యంలో .. ఆర్మీకి .. ఉగ్రవాదులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన నేపథ్యంలో ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. భారీ తారాగణం విషయంలోను అవి పోటీపడ్డాయి. అయితే సున్నితమైన అంశాలను మరింత లోతుగా .. గాఢంగా చెప్పడానికి తాము చేసిన ప్రయత్నం, ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఈ సినిమా మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందనేది చూడాలి. 



More Telugu News