Kaushal Manda: ఉదయ్ కిరణ్ విషయంలో అదే జరిగింది: నటుడు కౌశల్ మందా

Koushal Manda Interview
  • 'బిగ్ బాస్'తో కౌశల్ మందాకి గుర్తింపు 
  • సినిమాలతో బిజీగా ఉన్న నటుడు 
  • ఉదయ్ కిరణ్ తో ఎక్కువ సినిమాలు చేశానని వెల్లడి 
  • ఎదుగుతూ ఉంటే ఏడ్చేవారే ఎక్కువని కామెంట్         

కౌశల్ మందా .. ఇంతకుముందు ఆయన చాలా సినిమాలలో నటించినప్పటికీ, 'బిగ్ బాస్'లో కనిపించిన దగ్గర నుంచి మరింత పాప్యులర్ అయ్యాడు. నటుడిగా తన కెరియర్ ను కొనసాగిస్తున్న ఆయన, ఇటీవల వచ్చిన 'కన్నప్ప' సినిమాలోను చిన్న పాత్రను పోషించాడు. 'కన్నప్ప'కి సహచరుడిగా నటించడం వలన, ఆయన పాత్ర బాగానే రిజిస్టర్ అయింది. అలాంటి కౌశల్ తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

" నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అవుతోంది. చాలానే సినిమాలు చేశాను. ఉదయ్ కిరణ్ తో కలిసి 10 -12 సినిమాలలో నటించాను. అందువలన మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆయన తన కష్టసుఖాలు నాతో షేర్ చేసుకునేవాడు. నాకు తోచిన సలహాలు ఇస్తూ ఉండేవాడిని. ఉదయ్ కిరణ్ కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు. అలా ఎదగడం ఇక్కడ ఎంత కష్టమనేది నాకు తెలుసు" అని అన్నాడు. 

" ప్రస్తుతం ఈ సమాజంలో ఉన్న పరిస్థితులలో ఎదగడం చాలా కష్టమైపోయింది. ఎవరైనా ఎదుగుతూ ఉంటే సపోర్ట్ చేయకపోగా, సాధ్యమైనంత త్వరగా క్రిందికి లాగేయాలని చూస్తున్నారు. అలా చేయడం వలన వాళ్లకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. అదొక హ్యాపీనెస్ అంతే. ఎదుగుతున్నవారిని ఏదో ఒకరకంగా హింసించాలనుకునేవారు ఎక్కువైపోయారు. సెన్సిటివ్ గా ఉండే ఉదయ్ కిరణ్, అలాంటివారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు అంతే" అని చెప్పాడు.  

Kaushal Manda
Uday Kiran
Telugu Cinema
Kannappa Movie
Telugu One Interview
Big Boss Telugu
Movie Industry
Nepotism Telugu
Film Actor
Telugu Film Industry

More Telugu News