' వీరమల్లు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడే ఉంటుంది: నిర్మాత ఏ ఎమ్ రత్నం

  • రిలీజ్ కి దగ్గరలో 'వీరమల్లు'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఏఎమ్ రత్నం
  • క్రిష్ వెళ్లిపోవడానికి కారణమదేనని క్లారిటీ 
  • జ్యోతికృష్ణ ఎంపిక పవన్ దేనని వెల్లడి 
  • తిరుపతిలోగానీ .. విజయవాడలో గాని ప్రీ రిలీజ్ ఈవెంట్

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా కోసం ఆయన అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత ఏఎం రత్నం బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి 'సుమన్ టీవీ'తో మాట్లాడారు. 

"నేను ఒకసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తరువాత దానిని ఎప్పుడూ మార్చలేదు. కానీ 'వీరమల్లు' విషయంలో అలా జరగకపోవడంతో నేను చాలా ఫీలయ్యాను. ఇక ఈ సినిమా ఇప్పటివరకూ 14 సార్లు వాయిదా పడిందనే ప్రచారం కూడా నాకు చాలా బాధను కలిగించింది. ఇంతవరకూ ఈ సినిమా 3 మార్లు మాత్రమే వాయిదా వేశాము. అది కూడా పవన్ కల్యాణ్ గారు రాజకీయాలలో బిజీగా ఉండటం వలన రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోయాము" అని అన్నారు. 

"ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ వెళ్లిపోవడానికి కారణం, ఆయనకి మరో కమిట్ మెంట్ ఉండటమే కారణం. ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను మా అబ్బాయి జ్యోతికృష్ణకి అప్పగించమని చెప్పింది కూడా పవన్ కల్యాణ్ గారే. ఈ సినిమా విడుదలకి 4 రోజులు ముందు ప్రీ రిలీజ్ ఈవెంటు చేయాలని అనుకుంటున్నాము. ఆ సమయానికి వర్షాలు లేకపోతే తిరుపతిలో... వర్షాలు ఉంటే విజయవాడ - ఇండోర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము" అని చెప్పారు. 


More Telugu News