Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీ అడ్రస్ లీక్.. బయటపెట్టిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్!

Virat Kohli London Address Leaked by England Ex Cricketer
  • లండన్‌లో విరాట్ కోహ్లీ నివాసంపై ఆసక్తికర చర్చ
  • కోహ్లీ సెయింట్ జాన్స్ వుడ్‌లో ఉంటున్నట్టు హింట్ ఇచ్చిన జొనాథన్ ట్రాట్
  • గతంలో నాటింగ్ హిల్‌లో ఉంటున్నట్టు వచ్చిన వార్తలు
  • కుటుంబంతో కలిసి లండన్‌కు మకాం మార్చినట్టు కథనాలు
  • టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లండన్‌లో స్థిరపడ్డ కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎక్కడుంటున్నాడు? ఈ ప్రశ్న చాలామంది అభిమానులను తొలిచేస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడినట్టు వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన నివాసంపై స్పష్టత లేదు. అయితే తాజాగా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. కోహ్లీ లండన్‌లోని ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆయన పరోక్షంగా వెల్లడించాడు.

ఇటీవల ఓ క్రీడా చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ జొనాథన్ ట్రాట్.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అతను సెయింట్ జాన్స్ వుడ్‌లో లేదా దాని సమీపంలోనే కదా ఉండేది? అతడిని తిరిగి వచ్చేలా ఒప్పించలేమా?" అని ఆయన అన్నాడు. వాయవ్య లండన్‌లో ఉండే సెయింట్ జాన్స్ వుడ్, విలాసవంతమైన ఇళ్లకు ప్రసిద్ధి చెందిన నివాస ప్రాంతం. గతంలో కోహ్లీ నాటింగ్ హిల్ ప్రాంతంలో నివసిస్తున్నట్టు వార్తలు వచ్చినా ట్రాట్ వ్యాఖ్యలతో ఆయన ప్రస్తుత నివాసంపై కొత్త చర్చ మొదలైంది.

ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న కోహ్లీ లండన్‌లోనే ఉంటూ భారత జట్టు ప్రదర్శనను నిశితంగా గమనిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ సరసన నిలిచిన గిల్‌ను ‘స్టార్ బాయ్’ అని అభివర్ణించాడు. "చరిత్రను తిరగరాస్తున్నావు. నువ్వు వీటన్నింటికీ అర్హుడివి" అంటూ గిల్‌ను అభినందించాడు. ఈ పరిణామాలన్నీ కోహ్లీ లండన్‌లో స్థిరపడ్డారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
Virat Kohli
Virat Kohli London
Jonathan Trott
St Johns Wood
Shubman Gill
India Cricket
England Cricket
Cricket News
Sunil Gavaskar

More Telugu News