కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం

  • సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత
  • రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు స్వయానా సోదరుడు
  • 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్‌' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు గేయ రచయిత
  • కీరవాణి, రాజమౌళి కుటుంబాల్లో నెలకొన్న విషాద ఛాయలు
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగ‌ళ‌వారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శివశక్తి దత్త కేవలం కీరవాణి తండ్రిగానే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'చత్రపతి', 'సై', 'రాజన్న', 'హనుమాన్' వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలు రాశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన సేవలు అందించారు.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి శివశక్తి దత్త పెద్దనాన్న అవుతారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌కు ఈయన స్వయానా సోదరుడు. శివశక్తి దత్త మరణంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News