Shubman Gill: ఎక్కడ ఆ జర్నలిస్ట్? గెలిచాక ఇంగ్లిష్ రిపోర్టర్‌కు గిల్ అదిరిపోయే కౌంటర్!

Shubman Gills Epic Reply to English Reporter After Victory
  • ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా
  • టెస్టుల్లో ఇంగ్లండ్‌పై మొట్టమొదటిసారి గెలుపు
  • భారత్ రికార్డును ఎత్తిచూపిన జర్నలిస్టుకు గిల్ చురకలు
  • ప్రెస్ మీట్‌లో ఆ జర్నలిస్ట్ ఎక్కడని వెతికిన కెప్టెన్
  • బయటి విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేసిన గిల్
ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ వేదికపై ఇంగ్లండ్‌ను ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపు తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక ఇంగ్లిష్ జర్నలిస్టుకు తనదైన శైలిలో చురకలు అంటించాడు. 

మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక బ్రిటిష్ జర్నలిస్ట్, ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఉన్న పేలవమైన రికార్డును గుర్తుచేస్తూ గిల్‌ను ప్రశ్నించారు. అయితే, మ్యాచ్ గెలిచాక ప్రెస్ మీట్‌కు వచ్చిన గిల్ కళ్లు ముందుగా ఆ జర్నలిస్ట్ కోసమే వెతికాయి. "నాకు ఇష్టమైన జర్నలిస్ట్ కనపడట్లేదేంటి? ఎక్కడున్నారు? ఆయనను చూడాలనుకున్నాను" అంటూ గిల్ నవ్వుతూ అనడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

అనంతరం గిల్ మాట్లాడుతూ... "గత రికార్డులను, గణాంకాలను నేను నమ్మనని మ్యాచ్‌కు ముందే చెప్పాను. గత 56 ఏళ్లలో ఇక్కడికి ఎన్నో జట్లు వచ్చాయి. కానీ, ఇంగ్లండ్‌కు వచ్చిన జట్లలో మేమే అత్యుత్తమమని నేను నమ్ముతున్నాను. వారిని ఓడించి సిరీస్ గెలిచే సత్తా మాకుంది" అని ధీమా వ్యక్తం చేశాడు. సరైన నిర్ణయాలు తీసుకుంటూ పోరాడితే ఇది చిరకాలం గుర్తుండిపోయే సిరీస్ అవుతుందని ఆయన అన్నాడు.

ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోయినా, యువ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించారని గిల్ ప్రశంసించాడు. "మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఏ పిచ్‌పైనైనా 20 వికెట్లు తీయగల సత్తా మాకుంది. సిరాజ్, ఆకాశ్, ప్రసిధ్ కృష్ణ నిలకడగా రాణించడం వల్లే కీలక సమయాల్లో పైచేయి సాధించగలిగాం" అని తెలిపాడు.

తన బ్యాటింగ్ ప్రదర్శనపై మాట్లాడుతూ, ఐపీఎల్ చివరి దశ నుంచే ఈ సిరీస్ కోసం సిద్ధమయ్యానని, బయటి విమర్శలను తాము పట్టించుకోబోమని, సహచరుల నమ్మకమే ముఖ్యమని గిల్ స్పష్టం చేశాడు.
Shubman Gill
India vs England
Edgbaston Test
Indian Cricket Team
Jasprit Bumrah
Mohammed Siraj
Akash Deep
Test Cricket
Cricket Records
Press Conference

More Telugu News