తమిళనాట సీఎం అభ్యర్థిగా హీరో విజయ్
- విజయ్ ని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన తమిళగ వెట్రి కళగం పార్టీ
- తమ పార్టీదే గెలుపంటూ పార్టీ నేతల ధీమా
- ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న విజయ్
ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజకీయాలు సినిమాల్లా కాదని, ఇది చాలా సీరియస్ వ్యవహారమని ఆయన అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా, భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే తన పోరాటం ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.