Eloise Brown: లాంగ్ లైఫ్ కోసం 4 సూత్రాలు!

Eloise Brown 102 Year Old Woman Reveals 4 Secrets to Long Life
  • 102 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎలోయిస్ బ్రౌన్
  • దీర్ఘాయువుకు నాలుగు సాధారణ సూత్రాలు వెల్లడి
  • ఆరోగ్యానికి నీళ్లు తాగడమే ప్రధానం
  • రోజూ నడకతో చురుకైన జీవనశైలి
  • ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం
  • బలమైన విలువలు, జీవిత లక్ష్యం కలిగి ఉండటం
వందేళ్లు దాటి ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, అమెరికాకు చెందిన 102 ఏళ్ల ఎలోయిస్ బ్రౌన్ మాత్రం ఇప్పటికీ చురుగ్గా ఉన్నారు. 1922లో జన్మించిన ఈ బామ్మ, తన సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితానికి కారణమైన నాలుగు సులువైన సూత్రాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం జీవనశైలిలో చిన్న మార్పులతో దీర్ఘాయువును పొందవచ్చని స్పష్టం చేశారు.

ఆమె చెప్పిన నాలుగు సూత్రాలు ఇవే

1. మంచి నీళ్లు తాగడం: ఖరీదైన డైట్లు, చికిత్సల కంటే ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టడం ముఖ్యమని ఆమె నమ్ముతారు. అందుకే తాను నీళ్లు ఎక్కువగా తాగుతానని తెలిపారు. సరైన మోతాదులో నీరు తాగడం జీర్ణక్రియ నుంచి మెదడు పనితీరు వరకు అన్నింటికీ సహాయపడుతుందని శాస్త్రీయ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

2. చురుగ్గా ఉండటం: ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి చురుగ్గా ఉండటం కీలకమని ఆమె సూచించారు. ప్రస్తుతం ఆమె ఎక్కువ దూరాలు నడవకపోయినా, ఇంట్లోనే వీలైనంత వరకు కదులుతూ ఉంటారట. క్రమం తప్పని శారీరక శ్రమ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.

3. సానుకూలంగా ఉండటం: ఆమె ఎప్పుడూ నవ్వుతూ, సానుకూల దృక్పథంతో ఉంటారు. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని సైన్స్ కూడా చెబుతోంది. దీర్ఘాయువుకు ఇది చాలా చవకైన మందు లాంటిదని చెప్పవచ్చు.

4. బలమైన విలువలు, లక్ష్యం: తన సుదీర్ఘ జీవితానికి బలమైన విలువలే కారణమని ఆమె తెలిపారు. తన పిల్లలు, మనవళ్లతో సంతోషకరమైన కుటుంబాన్ని చూసుకోవడంలోనే తన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నానని చెప్పారు. జీవితంలో ఒక లక్ష్యం ఉండటం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సూచిక అని, ఇది మరణాల రేటును తగ్గిస్తుందని అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
Eloise Brown
102 year old woman
long life secrets
healthy lifestyle
longevity tips
healthy aging
positive attitude
water intake
physical activity
life goals

More Telugu News