Shinawatra: థాయిలాండ్ ప్రధాని షినవత్రను సస్పెండ్ చేసిన కోర్టు
- ప్రధాని విధులకు దూరంగా ఉండాలని ఆదేశం
- తుది తీర్పు వెలువడే వరకు సస్పెన్షన్ అమలు
- కంబోడియా నేతకు షినవత్ర ఫోన్ కాల్, ఆయనను అంకుల్ అని పిలవడంపై దుమారం
థాయిలాండ్ ప్రధాన మంత్రి షినవత్రకు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. షినవత్రను సస్పెండ్ చేస్తూ ఈ రోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పొరుగు దేశమైన కంబోడియాతో సరిహద్దు వివాదం విషయంలో ఆమె ప్రవర్తనపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్-కంబోడియాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. కంబోడియా సైనికుడు ఒకరు మరణించాడు. ఈ నేపథ్యంలో, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రధాని షినవత్ర, కంబోడియా నేత హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డ్ లీక్ అయింది. అందులో ఆమె హున్ సేన్‌ను 'అంకుల్' అని సంబోధించడంతో పాటు, థాయ్ సైనిక ఉన్నతాధికారి ఒకరిని తన 'ప్రత్యర్థి' అని పేర్కొనడం తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ ఘటనపై కొందరు కన్సర్వేటివ్ సెనేటర్లు రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాని షినవత్ర.. కంబోడియాకు తలొగ్గి దేశ సైన్యాన్ని బలహీనపరిచారని, మంత్రిగా ఉండాల్సిన నైతిక ప్రమాణాలను, నిజాయితీని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కేసులో తుది తీర్పు వెలువరించే వరకు ప్రధాని విధులకు దూరంగా ఉండాలని 7-2 మెజారిటీతో ఆదేశించింది. "జులై 1 నుంచి తుది తీర్పు ఇచ్చేంతవరకు ప్రతివాదిని (ప్రధాని) విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం," అని కోర్టు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో థాయ్‌లాండ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది.