భారతీయులకు ట్రంప్ భారీ ఊరట.. రెమిటెన్స్ పన్ను 1 శాతానికే తగ్గింపు

Donald Trump Announces Remittance Tax Cut for Indians
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే నగదుపై (రెమిటెన్స్‌) విధించాలని ప్రతిపాదించిన పన్నును ప్రభుత్వం తగ్గించింది. తొలుత 5 శాతంగా ఉన్న ఈ పన్నును తాజాగా ఒక శాతానికే పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలకమైన బిల్లు అమెరికా సెనెట్‌లో ఆమోదం పొందింది.

బ్యాంకు లావాదేవీలకు మినహాయింపు

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’లో ఈ రెమిటెన్స్ పన్నును చేర్చారు. తాజా ముసాయిదా ప్రకారం, ఈ పన్నును ఒక శాతానికి తగ్గించారు. అయితే, బ్యాంక్ ఖాతాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే నగదు బదిలీలకు ఈ పన్ను నుంచి పూర్తి మినహాయింపు కల్పించడం గమనార్హం. కేవలం మనీ ఆర్డర్, క్యాషియర్ చెక్కుల వంటి మార్గాల్లో పంపే సొమ్ముకు మాత్రమే ఈ ఒక శాతం పన్ను వర్తిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు.

తొలగిన ఆందోళన

వాస్తవానికి, ఈ ఏడాది మే నెలలో ఈ పన్నును తొలిసారిగా 5 శాతం చొప్పున విధించాలని ప్రతిపాదించారు. అమెరికా పౌరులు కాకుండా, హెచ్‌1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై ఇది వర్తిస్తుందని పేర్కొనడంతో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నిర్ణయం అమలైతే, ఏటా వారిపై దాదాపు 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,600 కోట్లు) అదనపు భారం పడుతుందని అప్పట్లో అంచనాలు వెలువడ్డాయి. తాజా నిర్ణయంతో ఆ ఆందోళన తొలగిపోయింది.
Go Back to Shorts
Donald Trump
Trump
Indian Remittance Tax
US Remittance Tax
H1B Visa

More Telugu News