Venkata Lakshmamma: కడప జిల్లాలో విషాదం... ఎలెక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ దుర్మరణం

Andhra Pradesh Woman Dies After Electric Scooter blast
  • కడప జిల్లా యర్రగుంట్లలో విషాద ఘటన
  • ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ పేలుడు
  • పక్కనే నిద్రిస్తున్న 62 ఏళ్ల మహిళ దుర్మరణం
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ మహిళ సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, పోట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ (62) కుటుంబ సభ్యులు రోజూ లాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. అయితే, తెల్లవారుజామున ఛార్జింగ్‌లో ఉన్న స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్కూటర్‌కు సమీపంలోనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మపై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా కాలిపోయి ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
Venkata Lakshmamma
Kadapa district
electric scooter explosion
electric vehicle fire
Yerraguntla mandal
Potladurthi village
Andhra Pradesh news
EV fire accident
electric scooter safety
fire accident death

More Telugu News