Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు మంత్రుల కమిటీ .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

Godavari Pushkaralu Ministerial Committee Formed by AP Government

  • 2027లో గోదావరి పుష్కరాలు
  • పుష్కరాలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు 12 మంది మంత్రులతో కమిటీని నియమించిన ప్రభుత్వం
  • మెంబర్ కన్వీనర్ గా దేవాదాయ శాఖ కార్యదర్శి

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులతో కూడిన ఈ ఉప సంఘం (కమిటీ) ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉప సంఘంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉంటారు. దేవాదాయశాఖ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఉప సంఘం కార్యాచరణను రూపొందించనుంది. ఆయా శాఖల అధికారులు మంత్రివర్గ ఉప సంఘానికి సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Godavari Pushkaralu
Andhra Pradesh
AP Government
Minister Committee
Anam Ramanarayana Reddy
Nimmala Ramanidu
Vangalapudi Anita
Godavari River
Pushkaralu 2027
Hindu Festival
  • Loading...

More Telugu News