Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Major Fire Accident in Delhi Function Hall
  • మోతీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో ఘటన
  • భారీ అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు
  • 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని ఒక ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి 8.47 గంటల ప్రాంతంలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 
Delhi Fire Accident
Delhi
Fire Accident
Moti Nagar
Function Hall
Fire Engines
National Capital
Breaking News

More Telugu News