మహేశ్ బాబు మనసు దోచిన ఆమిర్ కొత్త సినిమా
- 'సితారే జమీన్ పర్' ఒక అద్భుతమన్న ప్రిన్స్
- సినిమా అద్భుతంగా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్
- నవ్విస్తూ, ఏడిపిస్తూ చప్పట్లు కొట్టిస్తుందన్న మహేశ్
మహేశ్ బాబు తన పోస్ట్‌లో.. “‘సితారే జమీన్ పర్’ ఒక అద్భుతమైన సినిమా. ఆమిర్ ఖాన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఒక క్లాసిక్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు” అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆయన మాటలు సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
'సితారే జమీన్ పర్' చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్‌గా ప్రచారం పొందింది. మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్న కొందరికి ఒక కోచ్ బాస్కెట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో ఆమిర్ ఖాన్ కోచ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.