Gas Leak: షాకింగ్ వీడియో.. వంట చేస్తుండగా ఊడిన గ్యాస్‌ పైప్‌.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!

Gas Leak Woman Saves Home From Disaster Viral Video
  • సమయస్ఫూర్తితో సిలిండర్‌ను కిచెన్ నుంచి హాల్‌లోకి మార్చిన మ‌హిళ‌
  • తలుపులు, కిటికీలు తెరవడంతో గ్యాస్ బయటకు వెళ్లి తగ్గిన‌ తీవ్రత 
  • కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు 
  • ఈ ఘటన తాలూకు సీసీటీవీ వీడియో నెట్టింట‌ వైరల్
ఓ మహిళ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం త‌ప్పింది. వంట చేస్తుండగా స్టవ్‌ కు ఉన్న గ్యాస్‌ పైప్‌ ఒక్కసారిగా ఊడిపోయింది. అదేసమయంలో కిచెన్‌లో ఉన్న మహిళ తెలివిగా వ్యవహరించారు. సిలిండర్‌ను వంట గది నుంచి హాల్‌కి తీసుకొచ్చారు. కిచెన్‌తో పాటు హాల్‌ తలపులు, కిటికీలు తెరిచి ఉంచటంతో గ్యాస్‌ మొత్తం బయటకు వెళ్లిపోయింది. దీంతో పెను ముప్పు నుంచి తనతో పాటు ఇతరులను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఈ నెల 18న‌ మధ్యాహ్నం సుమారు 3.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తున్న సమయంలో స్టవ్‌కు అమర్చిన గ్యాస్ పైపు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో గ్యాస్ వేగంగా లీక్ అవ్వడం మొదలైంది. పరిస్థితిని గమనించిన ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. సిలిండర్‌ను వంటగది నుంచి హాల్‌లోకి తీసుకొచ్చారు. అలాగే వంటగది, హాల్‌లోని తలుపులు, కిటికీలన్నింటినీ తెరిచి ఉంచారు. దీనివల్ల లీకైన గ్యాస్ చాలా వరకు బయటకు వెళ్లిపోయింది.

కొంత సమయం తర్వాత ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. అయితే, అప్పటికే సిలిండర్‌ను ఇరుకైన వంటగది నుంచి విశాలంగా ఉన్న హాల్‌లోకి మార్చడం, తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

జరిగినదంతా హాల్‌లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మహిళ చూపిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. గ్యాస్ లీకేజీ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ నష్టం జరిగి ఉండేదని, మహిళ అప్రమత్తతే పెను ప్రమాదాన్ని తప్పించిందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Gas Leak
Gas Cylinder
Viral Video
Kitchen Accident
Woman Hero
Andhra Pradesh
Telangana
Home Safety
Fire Accident
Gas Stove

More Telugu News