అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది.. ఫలితం అనుభవించాల్సిందే: ఇరాన్
- మీరు మొదలు పెట్టారు.. మేం పూర్తిచేస్తామన్న టెహ్రాన్
- ఇకపై పశ్చిమాసియాలో అమెరికన్లకు స్థానంలేదని వ్యాఖ్య
- ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలే మా టార్గెట్.. హౌతీల హెచ్చరిక
పశ్చిమాసియాలోని అమెరికన్లను, అగ్రరాజ్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ లో అమెరికా వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు శపథం చేశారు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరగనుంది.