Poonam Kaur: ఆసక్తికర వీడియో పంచుకున్న పూనమ్ కౌర్
- నేడు వరల్డ్ యోగా డే
- దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు
- జమ్ము కశ్మీర్ లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న కుక్క
- వీడియో వైరల్
- లవ్ ఎమోజీతో స్పందించిన పూనమ్ కౌర్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. అందులో ఓ కుక్క యోగా చేస్తుండడం చూడొచ్చు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతదేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. జమ్ము కశ్మీర్ లోనూ యోగా కార్యక్రమాలు చేపట్టగా, ఓ కుక్క కూడా అందులో పాల్గొని యోగాసనాలు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నటి పూనమ్ కౌర్ ఆ వీడియోను రీట్వీట్ చేశారు. లవ్ ఎమోజీతో తన స్పందన తెలియజేశారు. ఈ వీడియోకు ఎక్స్ లో విశేష స్పందన లభిస్తోంది.