విశాఖ యోగా వేడుకలపై ప్రధాని మోదీ ప్రశంసలు.. మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక అభినందనలు

  • విశాఖ యోగా వేడుకల సక్సెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
  • ఏర్పాట్లలో మంత్రి లోకేశ్ చొరవకు ప్రధాని అభినందనలు
  • నెల రోజులుగా లోకేశ్ పర్యవేక్షణను కొనియాడిన మోదీ
  • యోగాను సామాజిక వేడుకగా మార్చారని ప్రశంస
  • 'యోగాంధ్ర'తో అన్ని వర్గాలను ఏకం చేశారని కితాబు
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగియడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చూపిన చొరవ, కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను గత నెల రోజులుగా మంత్రి లోకేశ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆయన నిరంతర పర్యవేక్షణ వల్లే కార్యక్రమాలు ఇంతటి ఘన విజయం సాధించాయని ప్రశంసించారు. యోగాను కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా, ఒక సామాజిక వేడుకగా ఎలా నిర్వహించవచ్చో లోకేశ్ చేసి చూపించారని కొనియాడారు.

అంతేకాకుండా, 'యోగాంధ్ర' పేరిట చేపట్టిన కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ సఫలీకృతులయ్యారని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక ఐక్యతను కూడా సాధించవచ్చని ఈ కార్యక్రమాల ద్వారా నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Your browser does not support HTML5 video.


More Telugu News