Droupadi Murmu: రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Narendra Modi Wishes President Droupadi Murmu on her Birthday
  • నేడు ద్రౌపది ముర్ము జన్మదినం
  • శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు
  • ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి అన్న మోదీ
నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆమె ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Droupadi Murmu
President of India
Narendra Modi
President Murmu Birthday
Indian President
Birthday Wishes
Political Leaders
Social Justice
Empowerment

More Telugu News