Vivo Y400 Pro: వివో నుంచి భారత మార్కెట్లోకి నేడే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్

Vivo Y400 Pro New 5G Smartphone Launching Today in India
  • భారత మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్ 15 ఓఎస్
  • 50ఎంపీ కెమెరా.. 5500ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర సుమారు రూ.25,000 ఉండే అవకాశం
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తన వై సిరీస్‌లో భాగంగా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయనుంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో 5జీ కనెక్టివిటీతో వస్తున్న వివో వై400 ప్రో (Vivo Y400 Pro) స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన వివో వై300 ప్రో మోడల్‌కు అడ్వాన్స్‌డ్‌ వర్షన్ ఇది. మరిన్ని అధునాతన ఫీచర్లతో ఈ కొత్త ఫోన్ రాబోతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుండటం విశేషం. దీనిలో 6.77 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అమర్చారు. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, వేగవంతమైన 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ సుమారు రూ.25,000లకు అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ ధరతో మార్కెట్లో ఇప్పటికే ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, నథింగ్ ఫోన్ 3, మోటరోలా ఎడ్జ్ 60 వంటి మోడళ్లకు వివో వై400 ప్రో గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక‌, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీ స్టైల్ వైట్, నెబులా పర్పుల్ కలర్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ ఈ ఫోన్ లభ్యం కానుంది.

వివో వై400 ప్రో పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే..
డిస్‌ప్లే: 6.77 ఇంచ్‌ AMOLED, 120Hz రిఫ్రెష్ రేటు, 4500 nits పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300
ర్యామ్: 8GB వరకు
స్టోరేజీ: 256GB వరకు
కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా (Sony IMX882), 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5500mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ 15
ఇతర ఫీచర్లు: 3D కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌, IP65 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌, యూఎస్బీ టైప్‌ సీ పోర్ట్
Vivo Y400 Pro
Vivo
Vivo Y Series
5G Smartphone
Android 15
MediaTek Dimensity 7300
OnePlus Nord CE4
Nothing Phone 3
Motorola Edge 60
Smartphone Launch India

More Telugu News