Chandrababu Naidu: కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu consoles Kuppam woman Sirisha over phone
  • కుప్పంలో దారుణ ఘటన
  • అప్పు తీర్చకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త
  • భార్యను చెట్టుకు కట్టేసిన వైనం
  • రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • పిల్లలను బాగా చదివించాలని సూచన
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా? అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పింది. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చంద్రబాబు అన్నారు. 

ఇక, శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో కూడా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని....ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి... అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సీఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Chandrababu Naidu
Kuppam
Sirisha
Andhra Pradesh
Chittoor district
Loan Harassment
Financial Assistance
Narayana Puram
Debt Relief
Government Support

More Telugu News