Basara: గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి.. బాసరలో విషాదం

Basara Tragedy Four Drown in Godavari River
  • హైదరాబాద్ నుంచి బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన కుటుంబం
  • నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు
  • నలుగురి మృతదేహాలు వెలికి తీత.. మరొకరి కోసం గాలింపు
బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం కోసం నదిలో దిగిన ఐదుగురు గల్లంతయ్యారు. నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.

నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన నది వద్దకు చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. స్థానిక అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు నలుగురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు. కాగా, మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.
Basara
Basara tragedy
Godavari River
Drowning incident
Nirmal district
Telangana news
Hyderabad devotees
Dilsukhnagar
River accident
Goddess Saraswati Temple

More Telugu News