Telangana Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
- ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ
- పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఉద్యోగుల కరవు భత్యాన్ని (డీఏ) 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన 3.64 శాతం డీఏతో ఉద్యోగుల మూల వేతనంపై అదనపు భత్యం కలవనుంది.