కుమారుడి అడ్మిషన్ కోసం పటాన్‌చెరు వెళ్లిన పవన్ కల్యాణ్?

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పటాన్‌చెరు పర్యటన
  • ఇక్రిశాట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ సందర్శన
  • కుమారుడి అడ్మిషన్ కోసమే వెళ్లినట్లు వార్తలు
  • పాఠశాల సౌకర్యాలు, వివరాలపై ఆరా తీసిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పర్యటించారు. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత ఇక్రిశాట్ క్యాంపస్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్‌హెచ్)‌ను ఆయన సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడు మార్క్ శంకర్ అడ్మిషన్ నిమిత్తమే పవన్ కల్యాణ్ ఈ పాఠశాలకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా, పాఠశాలలో అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారని, అక్కడి సౌకర్యాలను కూడా పరిశీలించారని సమాచారం. 

ఇటీవల పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో అగ్నిప్రమాదం బారినపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలోనే, కుమారుడి చదువుల కోసం హైదరాబాద్‌లోని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పటాన్‌చెరులోని ఐఎస్‌హెచ్‌ను ఆయన సందర్శించి ఉంటారని భావిస్తున్నారు. 


More Telugu News